రైలు ప్రయాణికులకు కొత్త రూల్స్‌.. ఇక నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు!

రాజనీతి | నేషనల్‌ | అక్టోబర్‌ 3, 2026 జన్‌ విశ్వాస్‌ చట్టంతో రైల్వే నిబంధనల్లో మార్పులు.. టికెట్‌ లేకుండా ప్రయాణం నుంచి పొగతాగడం, అక్రమ విక్రయాల వరకు కఠిన చర్యలు రైలు ప్రయాణికులు ఇక మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. రైళ్లలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకుని జన్‌ విశ్వాస్‌ (అమెండ్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొవిజన్స్‌) యాక్ట్‌–2026 కింద రైల్వే నిబంధనల్లో పలు మార్పులు చేశారు. టికెట్‌ లేకుండా ప్రయాణించడం, పొగతాగడం, అనధికారికంగా వస్తువులు విక్రయించడం, మహిళల కోసం కేటాయించిన సీట్లలో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు పెంచారు. టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే రూ.500 చెల్లుబాటు అయ్యే టికెట్‌ లేదా పాస్‌ లేకుండా ప్రయాణిస్తే గతంలో...