SIR పై మాజీ న్యాయమూర్తుల కమిషన్‌.. ఓటర్ల జాబితాపై స్వతంత్ర పరిశీలన!

రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్‌ 3, 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. SIR ప్రక్రియపై పరిశీలన చేసేందుకు లాయర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ కాన్‌స్టిట్యూషన్‌ (LAFC) మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో ఐదుగురు సభ్యుల స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌కు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ నేతృత్వం వహించనున్నారు. మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో ఐదుగురు సభ్యుల ప్యానెల్‌.. డిసెంబర్‌లో నివేదిక ఐదుగురు సభ్యులతో కమిషన్‌ జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌తో పాటు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌, మాజీ జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...