ఎస్‌ఐఆర్‌ నిలిపివేయాలని ఇండియా కూటమి డిమాండ్‌

మదనపల్లె అక్టోబర్ 1(రాజనీతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని ఇండియా కూటమి అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప అధ్యక్షతన ఎస్టీయూ కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. అక్టోబర్‌ 2 నుంచి 6 వరకు ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమి జెండాలతో ర్యాలీలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.