రాయలసీమలో హార్టికల్చర్‌ హబ్‌.. అక్టోబర్‌ 2న శంకుస్థాపన!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | అక్టోబర్‌ 1, 2026 రాయలసీమలో ఉద్యాన పంటలకు మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ హబ్‌కు అక్టోబర్‌ 2న మదనపల్లిలో శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రూ.లక్ష కోట్లతో భారీ ప్రణాళిక మదనపల్లిలో కీలక కార్యక్రమం.. రూ.లక్ష కోట్ల ప్రతిపాదనతో ఉద్యాన రంగానికి కొత్త దిశ ఈ హార్టికల్చర్‌ హబ్‌ కోసం మొత్తంగా దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించారు. ఇందులో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి...