ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.......ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలి!
రాజనీతి | అమరావతి | అక్టోబర్ 1, 2026 ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు హైకోర్టు తీర్పుతో కీలక మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 105, జీవో 1065లను కొట్టివేసింది. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి...