వాయల్పాడు టీబీ యూనిట్‌ను పరిశీలించిన రాష్ట్ర స్థాయి బృందం

వాయల్పాడు సెప్టెంబర్ 30 (రాజనీతి): జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వాయల్పాడు టీబీ యూనిట్‌ను రాష్ట్ర స్థాయి ఎవాల్యుయేషన్‌ బృందం బుధవారం విస్తృతంగా పరిశీలించింది. టీబీ రోగులకు అందుతున్న సేవలు, చికిత్స, ఫాలోఅప్‌, ప్రభుత్వం అందిస్తున్న రూ.1,000 పోషణ సహాయం తదితర అంశాలను పరిశీలించారు. రోగుల ఇళ్లను సందర్శించి ఆరోగ్య పరిస్థితి, మందుల వినియోగం, కుటుంబ సభ్యుల స్క్రీనింగ్‌పై వివరాలు సేకరించారు. అనంతరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి ల్యాబ్‌, రికార్డులను పరిశీలించి సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డా. ధీరజ్‌, డా. విగ్నిత, రవీంద్ర గణేష్‌, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.