అమరావతి ఐకానిక్‌ టవర్లలో అద్భుత ఇంజినీరింగ్‌.. లోపల ఒక్క పిల్లర్‌ లేకుండానే!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | సెప్టెంబర్‌ 30, 2026 అమరావతి నిర్మాణంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఐకానిక్‌ టవర్లు కేవలం ఎత్తు, ఆకృతితోనే కాదు.. వాటి వెనుక ఉన్న ఇంజినీరింగ్‌ టెక్నాలజీతోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సాధారణ భవనాల్లో కనిపించే వరుస పిల్లర్లకు భిన్నంగా.. డయాగ్రిడ్‌ (Diagrid) నిర్మాణ విధానం ద్వారా టవర్ల లోపలి ప్రదేశాన్ని విస్తృతంగా అందుబాటులో ఉంచేలా డిజైన్‌ చేశారు. అసలు డయాగ్రిడ్‌ అంటే ఏంటి? భవనం బయట భాగంలో ఉక్కు నిర్మాణాలను అడ్డంగా, నిలువుగా కాకుండా వికర్ణంగా X ఆకారంలో అమర్చే విధానమే డయాగ్రిడ్‌. ఈ ఫ్రేమ్‌ భవనంపై పడే భారం, గాలి ప్రభావం వంటి శక్తులను భవనం మొత్తం నిర్మాణానికి పంపిణీ చేయడంలో...