అమెరికా–ఇరాన్‌ చర్చల్లో ప్రతిష్టంభన.. ఖతార్‌ రాయబారం విఫలం!

రాజనీతి | అంతర్జాతీయం | సెప్టెంబర్‌ 30, 2026 అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు దౌత్యపరమైన పరిష్కారం చూపేందుకు ఖతార్‌ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. న్యూయార్క్‌లో ఇరాన్‌ ప్రతినిధులతో, అనంతరం అమెరికా అధికారులతో ఖతార్‌ మధ్యవర్తులు చర్చలు జరిపినా.. కీలక అంశాలపై ఇరు దేశాలూ తమ వైఖరి మార్చుకోకపోవడంతో ముందడుగు పడలేదు. రెండు దేశాలూ తమ షరతులపైనే అణు కార్యక్రమంపై అమెరికా షరతులు.. నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేయాలన్న ఇరాన్‌ డిమాండ్‌.. మధ్యవర్తిత్వంతోనూ కుదరని ఒప్పందం ఇరాన్‌పై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని టెహ్రాన్‌ కోరుతోంది. మరోవైపు ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేలా స్పష్టమైన హామీలు కావాలని అమెరికా కోరుతున్నట్లు...