సూపర్‌ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకూ హీట్‌ ముప్పు!

రాజనీతి | నేషనల్‌ | సెప్టెంబర్‌ 30, 2026 సూపర్‌ ఎల్‌నినో ప్రభావం రాబోయే నెలల్లో భారత్‌లో ఉష్ణోగ్రతలను మరింత పెంచే అవకాశం ఉందని తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి. సెప్టెంబర్‌ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు సాధారణ సంవత్సరంతో పోలిస్తే దేశంలో సుమారు 15,800 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ నివేదిక అంచనా వేసింది. ఇవి నమోదైన మరణాలు కాదు.. వాతావరణం, ఉష్ణోగ్రతలు, గత మరణాల నమూనాల ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక ప్రభావం ఆరు నెలల్లో దేశంలో 15,800 అదనపు మరణాల అంచనా.. ఏపీకి...