ఉల్లి ధరలకు చెక్‌.. ఏపీలో కిలో రూ.35కే!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | సెప్టెంబర్‌ 30, 2026 వంటింటి బడ్జెట్‌పై భారంగా మారుతున్న ఉల్లి ధరలకు కొంత ఊరట కల్పించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. తొలి దశలో విజయవాడలోని రైతుబజార్లలో ఈ విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. కుటుంబానికి నెలకు 2 కిలోలు మార్కెట్‌లో రూ.60-70 దాటిన ఉల్లి.. ఇక రైతుబజార్లలో సగం ధరకే! కుటుంబానికి నెలకు 2 కిలోల పరిమితి రాయితీ ఉల్లిని పొందేందుకు ఆధార్‌ కార్డు లేదా రేషన్‌ కార్డు చూపించాలి. ఒక్కో కుటుంబానికి నెలకు గరిష్ఠంగా 2 కిలోల ఉల్లిపాయలు రూ.35 చొప్పున అందించనున్నారు....