వరల్డ్‌ హార్ట్‌ డే 2026.. “డోంట్‌ మిస్‌ ఎ బీట్‌” పిలుపు! గుండె జబ్బుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు.. చిన్న మార్పులతోనే పెద్ద రక్షణ

రాజనీతి | ఆరోగ్యం | సెప్టెంబర్‌ 29, 2026 గుండె కొట్టుకుంటున్నంతకాలం మన జీవితం సాగుతూనే ఉంటుంది. కానీ గుండె ఆరోగ్యంపై మాత్రం చాలామంది సమస్య వచ్చినప్పుడే దృష్టి పెడతారు. కొన్ని గుండె సంబంధిత సమస్యలు స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే కొనసాగవచ్చు. అందుకే ముందస్తు జాగ్రత్త, లక్షణాలపై అవగాహన, క్రమమైన ఆరోగ్య పరీక్షలు కీలకమని వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ చెబుతోంది. ఈ సందేశంతోనే ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 29న వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సందేశం.. ‘డోంట్‌ మిస్‌ ఎ బీట్‌’ 2026 వరల్డ్‌ హార్ట్‌ డే ప్రచారానికి “Don’t Miss a Beat” అనే సందేశాన్ని కొనసాగిస్తున్నారు. గుండె జబ్బుల హెచ్చరికలను...