20 ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

మదనపల్లి సెప్టెంబర్ 29 (రాజనీతి): స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పేరుతో 20 ఏళ్లుగా విద్యుత్‌ శాఖలో సేవలందిస్తున్న మీటర్‌ రీడర్ల ఉపాధిని దెబ్బతీయరాదని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 2న ముఖ్యమంత్రి మదనపల్లి పర్యటన సందర్భంగా మీటర్‌ రీడర్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మదనపల్లి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మీటర్‌ రీడర్ల పీస్‌రేట్లు పెంచాలని, వారి విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యుత్‌ సంస్థలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్టు, థర్డ్‌ పార్టీ విధానాలను రద్దుచేసి దీర్ఘకాలంగా పనిచేస్తున్న...