AIతో ఉద్యోగాలకు ముప్పు?.. బిల్‌ గేట్స్‌ కీలక హెచ్చరిక!

రాజనీతి | టెక్నాలజీ కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. ఉద్యోగ భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ అనేక ఉద్యోగాల్లో మనుషుల అవసరం తగ్గే అవకాశం ఉందని ఆయన తన తాజా వ్యాసంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంట్రీ, మిడ్‌-లెవల్‌ ఉద్యోగాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒక్కో రంగంలో వేగంగా మార్పులు గేట్స్‌ ప్రకారం.. న్యాయ సేవలు, కస్టమర్‌ సర్వీస్‌, వైద్యం, సాఫ్ట్‌వేర్‌, తయారీ వంటి అనేక రంగాల్లో ఏఐ ఆధారిత వ్యవస్థలు మానవులు చేస్తున్న పనులను చేపట్టే అవకాశముంది. గత సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ఈ మార్పు...