పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టడం కష్టంగా ఉందా? తల్లులు ఇలా చేస్తే సులభమే!
రాజనీతి | హెల్త్ డెస్క్: పిల్లలకు పోషకాహారం అందించడం తల్లిదండ్రులకు తరచూ సవాలుగా మారుతుంది. ముఖ్యంగా చిన్నారులు కొత్త రుచులు, వాసనలు, ఆకృతులు ఉన్న ఆహారాన్ని తిరస్కరించడం సాధారణమే. ఇలాంటి సమయంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కంటే.. ఆహారాన్ని పరిచయం చేసే విధానాన్ని మార్చడం ఉపయోగకరంగా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచనలు చెబుతున్నాయి. ఒక్కసారి వద్దంటే వదిలేయకండి కూరగాయలు వద్దు.. పండ్లు వద్దు.. అంటూ మారాం చేసే పిల్లలకు బలవంతం వద్దు.. ఆహారాన్ని సరదాగా పరిచయం చేయడమే కీలకం కొత్త ఆహారం నచ్చకపోయినా వెంటనే దాన్ని పూర్తిగా మెనూ నుంచి తొలగించాల్సిన అవసరం లేదు. కొంత విరామం తర్వాత మళ్లీ చిన్న పరిమాణంలో...