జాతీయస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌కు దీక్షిత

పీలేరు, సెప్టెంబర్ 26 (రాజనీతి): జాతీయస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికైన పీలేరు వీఎస్‌ఎన్‌ సిద్ధార్థ విద్యాసంస్థకు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఐ.దీక్షితను శాప్‌ చైర్మన్‌ రవినాయుడు అభినందించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్‌ తేజ చొరవతో రవినాయుడు దీక్షిత, విద్యాసంస్థల అధినేత్రి మాధవితో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతకుముందు మద్దెల అమృత్‌ తేజ, జనసేన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బాటసారి ఆధ్వర్యంలో దీక్షితను శాలువాతో సత్కరించి స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సాయి సంపత్‌కుమార్‌, సంతోష్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.