ఏపీలో స్థానిక ఎన్నికలకు కసరత్తు ముమ్మరం.. హైకోర్టు తీర్పుపైనే ఉత్కంఠ!

రాజనీతి | అమరావతి | సెప్టెంబర్‌ 26, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. అయితే కొన్ని అంశాలపై హైకోర్టులో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో.. న్యాయస్థానం తీర్పు తర్వాత ఎన్నికల తదుపరి అడుగులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం కసరత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా సీఎస్‌, డీజీపీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. మున్సిపల్‌ పరిపాలన, పంచాయతీరాజ్‌, పాఠశాల విద్య, ఎక్సైజ్‌ తదితర శాఖల అధికారులతో సమన్వయంపై దృష్టి పెట్టారు. త్వరలో జిల్లా కలెక్టర్లు,...