సీఈసీ రాజీనామా చేయకపోతే ‘జంతర్ మంతర్ 2.0’.. CJP హెచ్చరిక
రాజనీతి | న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చుట్టూ కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక డిమాండ్లు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ 48 గంటల గడువు విధించింది. ఆలోపు రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ‘జంతర్ మంతర్ 2.0’ అంటూ హెచ్చరిక న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో CJP నేతలు తమ డిమాండ్లను వెల్లడించారు. 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త నిరసనలు చేపట్టి, అనంతరం ఢిల్లీలో ‘జంతర్ మంతర్ 2.0’ తరహా ఆందోళన నిర్వహిస్తామని...