“మాటలు కాదు.. ఆధారాలు చూపించు! ప్రమాణానికి నువ్వే రా!”...రూ.30 కోట్ల ఆరోపణలు రుజువు చేయగలవా..? కుమారస్వామి సవాల్

చిత్తూరు( రాజనీతి ): బీసీలను చిన్నచూపు చూడటం, నిజాయితీగా పనిచేసే వారిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ పీఏ కుమారస్వామి అన్నారు. తనపై రూ.30 కోట్ల అక్రమ సంపాదన చేశానంటూ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేశారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.తమ ఊరిలో క్వారీ ఉన్నంత మాత్రాన దానితో తనకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. క్వారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చిత్తూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమపై రాజకీయ ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని,...