పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండ
తిరుపతి, సెప్టెంబరు 22 (రాజనీతి): అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్అఫిషియో సభ్యుడు డాక్టర్ డాలర్స్ దివాకర్రెడ్డి అన్నారు. తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో పనబాక లక్ష్మి, నూకసాని బాలాజీ, జేబీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.