నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలి... ఎంపీడీవో మనోహర్రాజు
వాయల్పాడు, సెప్టెంబరు 22 (రాజనీతి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని విజయవంతం చేయాలని వాయల్పాడు ఎంపీడీవో మనోహర్రాజు పిలుపునిచ్చారు. మంగళవారం వాయల్పాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ 400 మి.గ్రా. మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వాయల్పాడు మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 6,452 మంది విద్యార్థులకు మాత్రలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించడంతో పాటు రక్తహీనతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి...