ఔషధాల సురక్షిత వినియోగంపై వాక్‌థాన్

రేణిగుంట, సెప్టెంబరు 22 (రాజనీతి): 6వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్‌ వారోత్సవం సందర్భంగా శ్రీ బాలాజీ మెడికల్‌ కాలేజ్‌, హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం వాక్‌థాన్‌ నిర్వహించారు. ఔషధాల హేతుబద్ధమైన, సురక్షిత వినియోగం, దుష్ప్రభావాల నివేదికపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంబీబీఎస్‌, బీపీటీ, నర్సింగ్‌ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. డీన్‌ డా. ఎం. హనుమంతరావు, డైరెక్టర్‌ డా. ఎం. నాగరాజు, జేఈఓ డా. ఎం. నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొనగా, ఫార్మకాలజీ విభాగాధిపతి డా. పి. మాధవ్‌ ఫార్మాకోవిజిలెన్స్‌ ప్రాధాన్యతను వివరించారు.