రియాద్‌ టార్గెట్‌గా హౌతీల దాడి.. అరామ్‌కో కేంద్రాలపైనా గురి!

రాజనీతి | అంతర్జాతీయం | సెప్టెంబర్ 21, 2026 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించారు. ఈ దాడుల్లో రియాద్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు వెల్లడించారు. అదే సమయంలో సౌదీ రక్షణ వ్యవస్థ రియాద్ వైపు వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. విమానాశ్రయం సమీపంలో మంటలు.. దట్టమైన పొగ దాడుల సమయంలో రియాద్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయి. కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో మంటలు, భారీగా పొగ కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే విమానాశ్రయానికే నేరుగా...