ఏఐసీసీ ఏపీ ఇన్‌చార్జ్‌కు సన్మానం

విజయవాడ, సెప్టెంబరు 20 (రాజనీతి): ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల నూతన ఇన్‌చార్జ్‌ పి.వి. మోహన్‌ను అన్నమయ్య జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దుగ్గనపల్లి సురేంద్రరెడ్డి ఘనంగా సన్మానించారు. ఆదివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కామన ప్రభాకర్‌, వైస్‌ప్రెసిడెంట్‌ సింగం రామకృష్ణారెడ్డితో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. దళిత, మైనారిటీ, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతామని నాయకులు తెలిపారు.