డాక్టర్ జమీల్కు ఎమ్మెల్యే నల్లారి నివాళులు
గుర్రంకొండ, సెప్టెంబరు 20 (రాజనీతి): గుర్రంకొండకు చెందిన డాక్టర్ జమీల్ మృతదేహానికి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.