మిట్టూరులో ఘనంగా అంగన్వాడి ఉత్సవం

చిత్తూరు ( రాజనీతి ) డైలీ దినపత్రిక: చిత్తూరు నగరంలోని మిట్టూరులో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనకు సమిష్టి సంకల్పాన్ని చాటేలా కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు చిట్టిబాబు కొల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో తల్లులు, గర్భిణులు, యువత పాల్గొన్నారు.మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్‌ అభియాన్‌, ఇంద్రధనుష్‌, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో–బేటీ పడావో, పీఎం స్వనిధి తదితర పథకాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల కోసం వినోదాత్మక...