వానాకాలం వచ్చేసింది.. ఈఈ మునిచంద్ర రంగంలోకి దిగారు!
చిత్తూరు (రాజనీతి) డైలీ దినపత్రిక: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ మునిచంద్ర సూచించారు. వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జిల్లాలోని నగరాలు, పట్టణాలు, మండలాల పరిధిలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నట్లు మునిచంద్ర తెలిపారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. చెట్లు విరిగిపడటం, స్తంభాలు దెబ్బతినడం, తీగలు తెగిపడటం వంటి ఘటనలపై సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు....