వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి... వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

రేణిగుంట, సెప్టెంబర్‌ 16 (రాజనీతి): రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేణిగుంట డీఎస్పీ వై.శ్రీనివాసరావు, రేణిగుంట రూరల్‌ సీఐ మంజునాథరెడ్డి తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెరువు వద్దకు నిమజ్జనానికి వచ్చే వాహనాలు సజావుగా రాకపోకలు సాగించేలా జేసీబీ సహాయంతో రహదారిపై ఉన్న అడ్డంకులను తొలగించి మార్గాన్ని సౌకర్యవంతంగా సిద్ధం చేశారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.