గణేష్‌ ఉత్సవాల్లో ఘనంగా అన్నదానం

వీరబల్లి, సెప్టెంబర్‌ 16 (రాజనీతి): గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా వీరబల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద భక్తులకు ఘనంగా అన్నదానం నిర్వహించారు. మాదిరెడ్డి రవిశంకర్‌రెడ్డి, పానీపూరి శ్రీనివాసులు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గణేష్‌ ఉత్సవాల సందర్భంగా భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్నదానం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.