వినాయక చవితి వేడుకల్లో ఘన అన్నదానం

రేణిగుంట, సెప్టెంబర్‌ 16 (రాజనీతి): వినాయక చవితిని పురస్కరించుకుని రేణిగుంట సీబీఐడీ కాలనీ, బ్యాక్ సైడ్ బాలాజీనగర్‌లో ప్రతిష్టించిన వినాయకుని విగ్రహం వద్ద నూతలపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అన్నదానంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వినాయకస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నూతలపాటి శ్రీనివాసులు, ఆయన సతీమణి పద్మ, కుమార్తె భారతి, అల్లుడు మదన్‌రాజు, మనవరాలు లిచి తదితర కుటుంబ సభ్యులు పాల్గొని అన్నదానాన్ని విజయవంతం చేశారు.