అరకోణం–రేణిగుంట మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్లకు కేంద్రం ఆమోదం
తిరుపతి, సెప్టెంబర్ 15 (రాజనీతి): అరకోణం–రేణిగుంట మధ్య 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 540 కి.మీ. మేర చేపట్టనున్న ఐదు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం పచ్చజెండా ఊపింది. అదనపు రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు మార్గంలో రద్దీ, రైళ్ల ఆలస్యాలు తగ్గనున్నాయి. ప్రయాణికుల రైళ్లకు మరిన్ని సేవలు అందుబాటులోకి రావడంతో పాటు సరుకు రవాణాకు కూడా వెసులుబాటు కలగనుంది. తిరుపతి, రేణిగుంట ప్రాంతాల రైల్వే కనెక్టివిటీ బలోపేతం కావడంతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించనుంది. ఈ ప్రాజెక్టుకు ఆమోదం...