ఆర్టీసీ ఏడుకొండల బస్‌స్టేషన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, సెప్టెంబర్‌ 15 (రాజనీతి): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ ప్రాంగణంలోని ఏడుకొండల బస్‌స్టేషన్‌లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి తిరుమలేశుని దర్శనానికి బస్సు ఎక్కిన ముగ్గురు పుణ్య దంపతులకు ఆర్‌ఎం శ్రీనివాసరావు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్టార్‌ కృష్ణ తదితరులు అధికారులను శాలువాలతో సత్కరించారు. భక్తులకు సురక్షిత ప్రయాణం కల్పించడంతో పాటు ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరేలా స్వామివారు ఆశీర్వదించాలని ప్రార్థించినట్లు స్టార్‌ కృష్ణ తెలిపారు....