కష్టాల్లో ప్రజలకు అండ.. రాజకీయాల్లో కజూర్ బాలాజీ జెండా!
చిత్తూరు:చిత్తూరు నగర రాజకీయాల్లో టీడీపీ సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. రాజకీయాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సహాయం చేయడం ద్వారా ఆయన స్థానిక ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చిత్తూరులో కజూర్ బాలాజీ పేరు వింటేనే సేవాభావం ప్రజలకు అండగా నిలిచే నాయకత్వం గుర్తుకు వస్తుందని ఆయన అభిమానులు అనుచరులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి తన పరిధిలో సహాయం అందిస్తూ బాలాజీ ప్రజలకు దగ్గరవుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పదవుల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయనకు నగరంలోని వివిధ వర్గాల నుంచి...