వైభవంగా వెంకట మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

కలికిరి సెప్టెంబర్ 11 (రాజనీతి): రాజంపేట పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను కలికిరి మండల వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చింతల రమేష్‌కుమార్‌రెడ్డి, వడ్డీ హరి, రాహుల్ చక్రవర్తిరెడ్డి, అనీఫ్, బాబురెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.