ప్రభుత్వ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ జరపాలి

రేణిగుంట, సెప్టెంబర్‌ 10 (రాజనీతి): రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించేందుకు బస్టాండ్‌ వద్దకు వచ్చినట్లు తెలిపారు. రేణిగుంట మండలంలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారు దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారని చింతా మోహన్‌ ఆరోపించారు. అన్నాస్వామిపల్లి, అల్లిమిట్ట, ఎంఆర్‌ఓ కార్యాలయం సమీపం, గురుకుల పాఠశాల పక్కన, తిమ్మయ్యగుట్ట, వేణుగోపాలపురం, ఎల్లమండ్యం ఎస్సీ కాలనీ సమీపం, తూకివాకం రహదారి మధ్య, వెంకటాపురం రోడ్డు పక్కన, చంగారెడ్డిపల్లి,...