తిరుపతి–విజయవాడ మధ్య ఫ్లై 91 విమాన సర్వీసు ప్రారంభం

తిరుపతి, సెప్టెంబర్‌ 10 (రాజనీతి): తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు నూతన విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది. ఫ్లై 91 సంస్థ నిర్వహించే ఈ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు తిరుపతి విమానాశ్రయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రారంభ విమానానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో సంప్రదాయ వాటర్‌ కేనన్‌ సెల్యూట్‌తో ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్‌ డి. భూమినాథన్‌, ఇతర ప్రముఖులు తొలి ప్రయాణికుడికి బోర్డింగ్‌ పాస్‌ను అందజేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి నూతన విమాన సర్వీసు ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర...