జేఎన్టీయూ విద్యార్థులకు తాగునీటి కష్టాలు

కలికిరి సెప్టెంబర్ 9 (రాజనీతి): కలికిరి జేఎన్టీయూ కళాశాల హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు మలతోటి నరేష్ డిమాండ్ చేశారు. క్యాంపస్‌కు ఒకే బోరు ఉండటంతో విద్యార్థుల అవసరాలకు సరిపడా నీరు అందడం లేదన్నారు. ఉదయం వేళ నీటి కోసం వేచి ఉండటంతో తరగతులకు ఆలస్యమవుతోందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బోరు మంజూరు చేసి నీటి వసతి కల్పించాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థుల పక్షాన నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు హరి, నితీష్, చరణ్, ఉదయ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.