జూలియన్ రాజును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

రేణిగుంట సెప్టెంబర్ 9 (రాజనీతి): ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బుధవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఆయన వెంట ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సంధ్య, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్, మాజీ సర్పంచ్ నగేషం, మండల కోఆప్షన్ సభ్యుడు హస్సేన్ సాహెబ్ తదితరులు ఉన్నారు.