అర్హులు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి
వాల్మీకిపురం, సెప్టెంబర్ 7 (రాజనీతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలు విడుదల చేసిందని, అర్హులైన వారు సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్ర సూచించారు. ఇందిరమ్మ కాలనీలో మండల అధ్యక్షుడు దామురెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియపై సందేహాలు ఉంటే సమీప సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పి.వి. నారాయణ, మురళి, ఖలందర్, గాంధీపేట రెడ్డి, తాహిర్, చాను, రెడ్డప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.