స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులో పుదిపట్ల హ్యాట్రిక్

చౌడేపల్లి, సెప్టెంబర్ 7 (రాజనీతి): పుదిపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడారంగంలో సత్తా చాటుతూ వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డును కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.జి. పద్మజ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో 4, 5వ స్థానాలు సాధించగా, అన్నమయ్య జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన స్పోర్ట్స్ డేలో 5వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. వరుస విజయాలు సాధించిన విద్యార్థులతో పాటు వారికి శిక్షణ అందించిన పీడీ వెంకటేశులను హెచ్‌ఎం అభినందించారు.