రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారుల సందడి...!!!!
చిత్తూరు: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో సందడి చేశారు. రంగురంగుల సంప్రదాయ వస్త్రాలు, అందమైన అలంకరణలతో ముస్తాబైన చిన్నారులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు.శ్రీకృష్ణుడు, రాధమ్మ వేషధారణలో చిన్నారులు చేసిన ముద్దుముద్దు హావభావాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు చిన్నారులు నెమలి పింఛం, వేణువు, కిరీటాలతో కృష్ణుడి వేషంలో అలరించగా.. మరికొందరు రాధమ్మ వేషంలో సంప్రదాయ ఆభరణాలతో మెరిశారు.చిన్నారుల ఉత్సాహం, చక్కటి వేషధారణతో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. చిన్నారుల తల్లిదండ్రులు వారిని ప్రత్యేకంగా అలంకరించి వేడుకలకు తీసుకురావడంతో సందడి వాతావరణం కనిపించింది. రాధాకృష్ణుల వేషధారణలో పాల్గొన్న చిన్నారులను పలువురు అభినందించారు.