విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్
కలికిరి, సెప్టెంబర్ 3 (రాజనీతి): సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నగిరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో తమ సమస్యలను వివరించారు. 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా తక్కువ జీతాలు పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం, ఇంధన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.