ఎయిడ్స్ నివారణపై అవగాహన పెంచాలి
వాయల్పాడు, సెప్టెంబర్ 3 (రాజనీతి): ఎయిడ్స్ నియంత్రణకు జనసమీకరణతో పాటు నేత్రదానాన్ని ప్రోత్సహించి ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. పీవీసీ జూనియర్ కళాశాలలో ఎయిడ్స్ సురక్ష, నేత్రదానం, టీబీ ముక్త్ భారత్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్ఐవీపై అపోహలకు దూరంగా ఉండి, అవసరమైన వారు ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 95-95-99 లక్ష్యాల సాధనతో ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.