చౌడేపల్లిలో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

చౌడేపల్లి, సెప్టెంబర్‌ 2 (రాజనీతి): ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను చౌడేపల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పీహెచ్‌సీలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్‌ ఆవరణలో కేక్‌ కట్‌ చేసి ప్రజలు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.