వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా చింతల నివాళులు

వాల్మీకిపురం, సెప్టెంబర్‌ 2 (రాజనీతి): పీలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాల్మీకిపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైకాపా నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్రంకొండ మండలం తరిగొండలోనూ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకిపురం కొత్తపేటలో అనారోగ్యంతో మృతి చెందిన సయ్యద్‌ రవుఫ్‌ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.