పేదల మధ్య పవన్‌ జన్మదిన వేడుకలు...8వార్డు శ్యామ్ కుమార్

నిరాశ్రయులకు అన్నదానం.. 8 కిలోల కేక్‌తో సంబరాలు.... చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని 8వ వార్డు వెంగళరావు కాలనీలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాలనీకి చెందిన శ్యామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని షెల్టర్‌ ఫర్‌ అర్బన్‌ హోమ్‌లెస్‌ కేంద్రంలో నిరాశ్రయులకు అన్నదానం చేశారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా పేదలు నిరాశ్రయులకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టడం పలువురి ప్రశంసలు అందుకుంది.ఈ సందర్భంగా శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాల రూపంలో వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా ఆయన జన్మదినాన్ని ఇదే...