అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాప్తికి అడ్డుకట్ట: రఫీ
సోమల, ఆగస్టు 31 (రాజనీతి): ఎయిడ్స్ వ్యాప్తిని నియంత్రించేందుకు యువతలో అవగాహన కల్పించడం ఎంతో కీలకమని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. అంతర్జాతీయ యువజన మాసోత్సవాలు, నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎయిడ్స్ సురక్ష, నేత్రదానం, టీబీ ముక్త్ భారత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్ఐవీపై అపోహలకు దూరంగా ఉండి, అవసరమైన వారు పరీక్షలు చేయించుకోవాలని, 95-95-99 లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రఫీ పిలుపునిచ్చారు. హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకూడదన్నారు. నేత్రదానం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపవచ్చని పేర్కొని విద్యార్థులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అమరేంద్ర, వైద్య సిబ్బంది, అధ్యాపకులు,...