బోయకొండ గంగమ్మ ఆలయ గోశాలకు రూ.50 వేల విరాళం

చౌడేపల్లి, ఆగస్టు 31 (రాజనీతి): ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానం నిర్వహిస్తున్న గోశాల అభివృద్ధి, గోసేవ కోసం రూ.50 వేల విరాళం అందించారు. చౌడేపల్లికి చెందిన మలేషియా ఏపీ ఎన్నార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కోఆర్డినేటర్‌ శ్రీరామ జగదీష్‌ రాయల్‌, హిమబిందు దంపతులు ఈ మొత్తాన్ని ఆలయ ఈవో, డిప్యూటీ కమిషనర్‌ ఏకాంబరంకు అందజేశారు. అనంతరం దంపతులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. గోసేవకు దాతలు ముందుకు రావడంపై ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.