భాకరాపేటలో వైఎస్సార్‌సీపీ బ్యానర్ల ధ్వంసంపై ఫిర్యాదు

భాకరాపేట, ఆగస్టు 31 (రాజనీతి): భాకరాపేటలో వైఎస్సార్‌సీపీ బ్యానర్లు ధ్వంసం చేసిన ఘటనపై మాజీ సర్పంచ్‌, మాజీ సైనికుడు సాకిరి భూపాల్‌ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో టీడీపీకి చెందిన శ్రీరామ తులసీరామ్‌, అసనాపురం సునీల్‌ బ్యానర్లను చింపివేసినట్లు ఆరోపించారు. అనంతరం ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోన్‌ కాల్‌ వివరాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.