మధుసూదన్‌ నాయుడును కలిసిన పుంగనూరు టీడీపీ నాయకులు

పుంగనూరు, ఆగస్టు 31 (రాజనీతి): పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన మధుసూదన్‌ నాయుడును పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఇన్‌చార్జిని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు మధు రాయల్‌, సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.