పేదల కోసం ఉచిత వైద్య శిబిరం

రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామనగర్‌లోని సుందరయ్య కాలనీలో పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీ లలిత సహస్రశక్తి పీఠం ఆధ్వర్యంలో డాక్టర్‌ కాళిదాసుశర్మ వైద్య సేవలు అందించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రతి ఆదివారం శిబిరం కొనసాగుతుందని ప్రజాసంఘాల నాయకుడు రాజశేఖర్‌ తెలిపారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మీపతి, ఎర్రస్వామి, దీప, డాక్టర్‌ కాళిదాసుశర్మ తదితరులు పాల్గొన్నారు.